- సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని పులాంగ చౌరస్తా వద్ద డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో ప్రజలందరికీ మేలు చేకూర్చే న్యాయస్థానం అత్యున్నత న్యాయమూర్తి అయిన జస్టిస్ గబాయ్ పైన దాడి చేయటం భారత న్యాయ వ్యవస్థ పైన, భారత రాజ్యాంగం పైన దాడి చేయడం గా భావిస్తున్నామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా రూపొందించిన న్యాయ సూత్రాలను అమలు జరిపే చేయటమంటే భారత రాజ్యాంగాన్ని, లౌకిక భావాలను దేశ సార్వభౌమత్వాన్ని కించపరచడమే అవుతుందని ఆయన విమర్శించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే పద్ధతుల్లో దాడులు చేస్తామని హెచ్చరించటం అంటే ఈ దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా సిద్ధాంతానికి అనుగుణంగా మతోన్మాద భావజాలం తోటి భారతర రాజ్యాంగం పై చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు ఆయన అన్నారు. దాడి చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకొని శిక్షించినప్పుడే భారత రాజ్యాంగం పైన సరైన నమ్మకం ప్రజలకు కలుగుతుందని ఆయన అన్నారు. ఇంతటి దుశ్చర్యకు పాల్పడినప్పటికీ న్యాయశాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఈ ఘటనపై మాట్లాడకపోవడం వారి ఆలోచన విధానాన్ని తెలియజేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు, p.వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, నన్నే సాబ్, సుజాత, నాయకులు సాయిలు, మోహన్ ,సిర్పలింగం, సత్యనారాయణ, లక్ష్మి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.