Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2025, 11:27 am Posted by : ramakrishna

కేసీఆర్ తెచ్చిన చట్టమే గుదిబండగా మారింది

హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదని విమర్శించారు.  శాసన సభలో ఆదివారం పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను గతంలో తాము ఆమోదించి గవర్నర్ కుం పంపించామన్నారు. 2018లో కేసీఆర్ పంచాయతీ రాజ్ చట్టం తెచ్చారని అందులో 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి ఎన్నికలు నిర్వహించాలని ఉందన్నారు. అలాగే 2019లో తెచ్చిన మున్సిపల్ చట్టంలోనే అదే ఉందన్నారు. ఈరెండు చట్టాలు గుది బండగా మారడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని గవర్నర్ కు పంపించామన్నారు. గవర్నర్ బీఆర్ఎస్ నేతల మాటల నమ్మి బిల్లు ను రాష్ట్రపతికి పంపించారన్నారు.  ప్రస్తుతం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందన్నారు.  రిజర్వేషన్ల బిల్లు అమలైతే తాను సంతోషంగా ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారని, తమ నాయకులైన కేసీఆర్, కేటీఆర్, ఈబిల్లు అమలైతే సంతోషంగా ఉండరని చెప్పకనే చెప్పారన్నారు.  ప్రధాని అపాయింట్ అడిగినా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి కల్వకుంట్ల కుటుంబం కాదు.. ఎవరూ కలవకుండా చూసే కుటుంబమని వ్యాఖ్యనించారు.