ప్రజల భాష కాళోజీ కవిత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజల భాషలో సాహిత్య సృష్టి ప్రజా చైతన్యానికి దోహదపడుతుందని ప్రజా కవి కాళోజి "నా గొడవ" పుస్తకం చదివితే అర్థమవుతుందని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. సోమవారం సాయంత్రం కేర్ డిగ్రీ కళాశాలలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం కాళోజీ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాళోజి జయంతిని పురస్కరించుకొని ఆయన రాసిన నా గొడవ లోని కవితల్ని హరిదాసభ్యులు పఠించి కాళోజికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల...