Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2024, 7:19 pm Posted by : ramakrishna

ప్రజల భాష కాళోజీ కవిత

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజల భాషలో సాహిత్య సృష్టి ప్రజా చైతన్యానికి దోహదపడుతుందని ప్రజా కవి కాళోజి “నా గొడవ” పుస్తకం చదివితే అర్థమవుతుందని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. సోమవారం సాయంత్రం కేర్ డిగ్రీ కళాశాలలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం కాళోజీ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాళోజి జయంతిని పురస్కరించుకొని ఆయన రాసిన నా గొడవ లోని కవితల్ని హరిదాసభ్యులు పఠించి కాళోజికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రతి ఇంటిలో కనబడి పెద్దమనిషి లాగా కాళోజి కవిలోకానికి దిశా నిర్దేశం చేస్తాడని అన్నారు.మల్లవరపు చిన్నయ్య,పోతులూరి లక్ష్మణ్,ప్రసిద్ధ గాయకుడు సిర్ప లింగం,నక్షత్రం సత్యనారాయణ స్వామి,కొయ్యడ శంకర్,కొమిరిశెట్టి నాగరాజు సందేశ్ తదితరులు పాల్గొని కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.