భూసేకరణ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో చేపట్టే రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి అనవసర జాప్యానికి తావు లేకుండా భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ వీసీ కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్ల విస్తరణ, రైల్వే పనులు, నీటి పారుదల, జాతీయ రహదారులు, పరిశ్రమల స్థాపన తదితర వాటికి అవసరమైన భూసేకరణపై సంబంధిత అధికారులతో శాఖల వారీగా కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత పనుల...