Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 2:23 pm Posted by : ramakrishna

సిద్థాపూర్ రిజర్వాయర్  భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

 

. . . అధికారులతో సమక్షించిన ప్రభుత్వ సలహాదారు పోచారం

 హైదరాబాద్, బతుకమ్మ:

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన నాణ్యత లోపం లేకుండా  పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై అటవీ శాఖ అధికారులు  పిసిఎఫ్ శ్రావణ్ ( నోడల్ ఆఫీసర్ ), ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇ.శ్రీనివాస్, కామారెడ్డి ఇంచార్జి  సి ఇ దక్షిణామూర్తి, బాన్సువాడ, ఇఇ రాజశేఖర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ…సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా 23 మే 2026 న జరిగిన కేబినెట్ సమావేశంలో ముంపు ప్రభావిత భూములు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ. 55.30 కోట్లు మంజూరు చేస్తూ జి.ఓ. నం. 37 ద్వారా 08 జూన్ 2026న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.ఈ నేపథ్యంలో సిద్దాపూర్ రిజర్వాయర్ పురోగతిపై ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు పాటుపడాలని కోరారు.

The land acquisition process for the Siddhapur reservoir must be expedited