Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2025, 9:54 pm Posted by : ramakrishna

లంబాడా జాతి ఉన్నతిని కాపాడాలి

  • డివిజన్ నాయకులు బాధవత్ శర్మ నాయక్

 

భీమ్ గల్, బతుకమ్మ : నూతంగా ఎన్నికైన బంజారా సేవ సంఘ్  కార్యవర్గ నాయకులు, సభ్యులు మన లంబాడా జాతి ఉన్నతికోసం పాటుపడాలని ఆర్మూ ర్ డివిజన్ ఎన్నికల నిర్వహణ పర్యవేక్షకులు, డివిజన్ సంఘ్ నాయకులు భాధవత్ శర్మ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ఆర్మూర్ డివిజన్ బాల్కొండ కానిస్టెన్సీలోని కమ్మర్ పల్లి, ఎర్గట్ల మండల బంజారా సేవ సంఘ్ మండల కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. డివిజన్ ఎన్నికల అధికారి భూక్యా లక్ష్మణ్ నాయక్ ఏ. డీ. ఈ, తాజా మాజీ ఏబిఎస్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ భూక్యా చంద్రునాయక్ ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కమ్మర్ పల్లి మండల అధ్యక్షులుగా మాలవత్ ప్రకాష్, జనరల్ సెక్రటరీగా లాకావత్ గంగాధర్ నాయక్ లు, ఎర్గట్ల మండల అధ్యక్షులుగా రాథోడ్ ఆంజనేయులు నాయక్,జనరల్ సెక్రటరీగా మాలవత్ భీమా నాయక్  లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికలు ఆయా మండలాల తాండల నాయక్, కార్భరీలు, బంజారా ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం చాలా సంతోషమని, ఈ ఎన్నికలు జాతి ఐక్యతకు తర్కణమని ఆయన అన్నారు. జిల్లా సంఘ్ నాయకులుగా, సభ్యులుగా ఎన్నికైన వారు జాతి పట్ల అంకిత భావంతో పని చేయాలని శర్మ కోరారు.