Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 8:34 pm Posted by : ramakrishna

తుది దశకు చేరిన కోటగిరి మండల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ

 

ఐదు గ్రామాలకు చెందిన అభ్యర్థులు ఏకగ్రీవం

ఎన్నికల బరిలో 41 మంది సర్పంచ్ అభ్యర్థులు.

80 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం.

ఎన్నికల బరిలో 127 వార్డు సభ్యులు.

వివరాలు వెల్లడించిన ఎంపీడీవో విష్ణు.

 కోటగిరి, బతుకమ్మ :

కోటగిరి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకొని అభ్యర్థులకు ఆయన గుర్తులను కేటాయిం చినట్లు కోటగిరి ఎంపీడీవో విష్ణు పేర్కొన్నారు.ఈ సందర్భం గా విష్ణు మాట్లాడుతూ.కోటగిరి మండలం పరిధిలోని అడ్కాస్పల్లి,దేవుని గుట్ట తండా,సుద్దులం తాండ,రాంపూర్, వల్బాపూర్ గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని అలాగే మండల వ్యాప్తంగా 80 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయ ని ఆయన అన్నారు.మండల వ్యాప్తంగా 41 గ్రామ సర్పంచ్ అభ్యర్థులు అలాగే 167 వార్డ్ అభ్యర్థులు ఆయా గుర్తులతో ఎన్నికల బరిలో ఉంటున్నారని ఆయన అన్నారు.

The Kotagiri Mandal Sarpanch election process has reached its final stage.