ఇసుకాసురుల ఇష్టారాజ్యం
అక్రమంగా ఇసుక డంపులు.. రుద్రూర్, బతుకమ్మ: రోజు రోజుకు ఇసుక మాఫియా పెట్రేగి పోతుంది. పోతంగల్ లోని మంజీరా నది నుండి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఠాగా ఏర్పడిన కొంతమంది ఇసుక దందా చేసేవాళ్లు రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామ శివారు ప్రాంతాల్లోని షాదీఖాన వద్ద భారీ మొత్తంలో ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ మొత్తంలో ఇసుకను డంపులు చేస్తూ అర్థ రాత్రి వేళల్లో బొప్పాపుర్, చందూర్, మోస్రా...