ఇసుకాసురుల ఇష్టారాజ్యం
డెయిరీ ఫామ్ లో అక్రమంగా ఇసుక డంపులు రుద్రూర్, బతుకమ్మ : ఇసుక మాఫియా రోజు రోజుకు పెట్రేగి పోతుంది. ఇసుకాసురులు తమకేమిలే అన్నచందంగా ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. పోతంగల్ మండలం మంజీరా నది నుంచి ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఠాగా ఏర్పడిన కొంతమంది ఇసుక దందా చేసేవాళ్లు రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలోని ఓ డైరీ ఫామ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 10 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులు చేశారు. ఈ విధంగా ఇసుకను అక్రమంగా...