సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న కవిత దంపతులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో సీతారాముల కళ్యాణోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత - దేవనపల్లి అనిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కవిత దంపతులు అందజేశారు. కవిత దంపతులకు సంప్రదాయబద్ధంగా అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న కవిత దంపతులు పాల్గొన్నారు.