Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 5:36 pm Posted by : ramakrishna

జూనియర్ అసిస్టెంట్ ను మాణిక్ బండర్ స్కూల్లోనే ఉంచాలి

  • కలెక్టర్ కు గ్రామ కమిటీ విన్నపం

 

ఇందూర్, బతుకమ్మ: మాణిక్ బండర్ పాఠశాలలో డిప్యూటేషన్ పై పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రంజిత్ రెడ్డిని యధావిధిగా కొనసాగించాలని గ్రామ కమిటీ సారథ్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. నూతన మండలాల ఏర్పాటుతో సాలూరు మండల పరిషత్ కు సిబ్బందిని కేటాయించారు. ఎడపల్లి మండలంలోని జూనియర్ అసిస్టెంట్ రంజిత్ రెడ్డి, మాణిక్ బండర్ ఉన్నత పాఠశాలలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నాడు. సర్దుబాటులో భాగంగా డిప్యూటేషన్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ ను నూతన మండలమైన సాలూరు కు పోస్టింగ్ ఇచ్చారు. మాణిక్ బండర్ పాఠశాలలో ఎక్కువ మంది మహిళ ఉద్యోగులే ఉన్నారు. సబర్డినేట్ లేకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ పనులు చక్కదిద్దే వాడు. దీనిని గుర్తించిన గ్రామ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో తమ పాఠశాలలో ఇది వరకు పని చేసిన సాలూరు మండలంకు పంపిన జూనియర్ అసిస్టెంట్ ను మాణిక్ బండర్ లోనే ఉంచాలని కోరుతూ కలెక్టర్ కు విన్నవించారు. గ్రామ పాఠశాల నుంచి బదిలీ చేయడం వల్ల రోజు వారి కార్యాలయ పనులయందు తీవ్ర అసౌఖర్యం కలిగి పాఠశాల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు కలుగుచున్నవని గుర్తించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బదిలీ గావింపబడిన జూనియర్ అసిస్టెంట్ ను తిరిగి మాణిక్ బండర్ పాఠశాలలో నియమించాలని కోరుతూ కలెక్టరేట్ లో ఏ ఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ మహేష్, సభ్యులు సాయిబాబా తో పాటు తదితరులు ఉన్నారు.