Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 8:29 pm Posted by : ramakrishna

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

 

. . . టియుసిఐ యూనియన్ జిల్లా నాయకురాలు వి.సత్తెమ్మ

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ రూరల్కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు జి. కిషన్, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు వి. సత్తెమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు పెంచుతామని ప్రకటించిన వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించి పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, పని భారం తగ్గించాలని వారు పేర్కొన్నారు. అలాగే మల్టీపర్పస్ 51 జీవోను రద్దు చేయాలని, కారోబార్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, రిటైర్మెంట్ సమయంలో కార్మికులకు రూ.5 లక్షల బెనిఫిట్స్ అందించాలని, విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల గ్రాట్యూటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకెఎంఎస్ జిల్లా నాయకులు దయల్ సింగ్, కిషన్, దశరథ్‌తో పాటు మోర్తాడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులు గంగు, ముత్తన్న, ముత్తక్క, నర్సయ్య, సువర్ణ, చిన్నక్క, గజానంద్, ముత్తు, గంగారాం, మజీద్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.