. . . వైట్ కాలర్ నేరాల పై ప్రజలలో అవగాహన పెంచాలి
. . . ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలి
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
సీ.ఎం.ఆర్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని కోర్టుల్లో కేసుల ప్రాసిక్యూషన్ బలోపేతం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి పై డివిజన్ల ఏసీపీలు , సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు పోలిస్ కమీషనర్ సాయి చైతన్య సమీక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..ప్రత్యేకంగా ఎక్కువకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కేసుల పురోగతిని తరచూ సమీక్షిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.నిజామాబాద్ లో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలపై ప్రధానంగా సైబర్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్‌లు, ఆర్థిక నేరాలు, నకిలీ పత్రాల తయారీ వంటి అంశాలపై చర్చించి, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని , సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని , ప్రజలలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు త్వరిత న్యాయం అందేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను గురించి , సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవే రోడ్డు లను కలుపుతూ ఉండేటటువంటి లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయించడం , రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధముగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే ,స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్ ) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసిపి రాజ వెంకటరెడ్డి , బోధన్ ఏసిపి శ్రీనివాస్ , ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సైబర్ క్రైమ్ ఏసిపి వై.వెంకటేశ్వరరావు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిసిఆర్బి సిఐ రమేష్ సిఐలు , ఎస్సైలు,ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
