హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఆదిలాబాద్, హకీంపేట్, దుండిగల్, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, పటాన్ చెరు, రాజేంద్రనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉషోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.