మహానీయుల స్ఫూర్తి భావితరాలకు ఎంతో అవసరం
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మహానీయుల స్ఫూర్తి భావితరాలకు ఎంతో అవసరమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టడం ఎంతో సంతోషం ఉందని, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ...