. . . పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలి
. . . బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలలను కుదించాలని చేస్తున్న ఆలోచన ను ప్రభుత్వం విరమించుకోవాలని లేనిచో ప్రభుత్వ పాఠశాలల్లో బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బిసి సంఘం ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం నిర్వహించిన బిసి ఉపాధ్యాయ సంఘం సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ని అమలు చేయాలని ,పెండింగ్ లో ఉన్న 6 డిఏ లు వెంటనే విడుదల చేయాలని కోరారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, మోడల్ స్కూల్, గురుకుల, కెజిబివి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. డిఎస్సీ 2003 ఒకే నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని, తెలంగాణ రాష్ట్రం లో కూడా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామ కృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ.మోహన్, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కొట్టూరు రమేష్, ఉపాధ్యక్షులు సుమన్, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.