Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 7:55 pm Posted by : ramakrishna

సెల్ టవర్ ఎక్కి వృద్ధుడి హల్ చల్

బతుకమ్మ భిక్కనూరు: ఒక వృద్ధుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన మల్లయ్య (65) వృద్ధుడు తాగుడుకు బానిసై ఉన్న ఆస్తిని అమ్ముకున్నాడని కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. కోపంతో కుమారుడు తండ్రి పైన చాయి పోయడంతో వృద్ధుడు కోపంతో ఊగిపోయి పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కాడు కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా కిందికి రాకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఎస్ఐ ఆంజనేయులు చేరుకొని వృద్ధుడిని నీకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వృద్ధుడు క్రిందికి దిగి వచ్చాడు.