Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 7:49 pm Posted by : ramakrishna

మే 5న నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలి

 

. . . ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఈ నెల 5న నిజామాబాద్ జిల్లా ఐడిఓసి కార్యాలయ ఆవరణలో తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్ష ను విజయవంతం చేయాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక & పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. టీఎన్జీవోస్ జిల్లా కార్యాలయం స్వర్గీయ బి.స్వామినాథం సమావేశ మందిరం లో శనివారం టిజిఈజేఏసి జిల్లా చైర్మన్ అధ్యక్షతన నిరాహార దీక్ష సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టిజిఈజేఏసి భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జూన్ 2 లోపు పీఆర్ సి ని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను ఒకేసారి చెల్లించాలని, హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు మిగతా 64 డిమాండ్ల సాధనకు మే 5వ తేదీన చేపట్టబోయే ఒకరోజు నిరాహార దీక్ష ను విజయవంతం చేయుటకు గాను టిజిఈజేఏసి భాగస్వామ్య సంఘాల సభ్యులందరూ పెద్ద ఎత్తున ఉద్యోగులతో తరలి వచ్చి శాంతియుతంగా దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిజిఈజేఏసి భాగస్వామ్య సంఘాల జేఏసీ జిల్లా నాయకులు పి. మోహన్ రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, నేతికుంట శేఖర్, జాకీర్ హుస్సేన్, వనమాల సుధాకర్, శ్రీకాంత్, జమీలుల్లా, రమణాచారి, ఓమాజీ, పోల శ్రీనివాస్, రాజీవ్, గంగాకిషన్, వీరేందర్ సింగ్, అన్వర్ అలీ, వినోద్, జాఫర్ హుస్సేన్, స్వామి, జ్ఞానేశ్వర్, కార్తీక్, శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, ప్రవీణ్ రాజ్, ధరమ్ సింగ్, శ్రీరాములు, పురుషోత్తం, రవీందర్, సూర్య ప్రకాష్, ఆంజనేయులు, అశ్విన్ కుమార్, సిర్ప రాజు, మహేందర్, అనురాధ, వినీత, గంగరాజు, మంగమ్మ, వెస్లీ పాల్గొన్నారు.

 

The hunger strike on May 5th must be made a success.