మందుల తయారీకి మానవ శరీరమే మూలం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డెడ్ బాడీ లేనిదే మందులు తయారు చేయడం సాధ్యం కాదని, మరణానంతరం మృతదేహాన్ని కాల్చడమో, పాతి పెట్టడము కంటే మెడికల్ కాలేజ్ లకు దానం చేస్తే విద్యనభ్యసించే విద్యార్థులకు ఉపయోగం ఉంటుందని, దీని మూలంగా నైపుణ్యం గల వైద్యులను భావితరాలకు అందించగలుగుతామని నేత్ర అవయవ మరియు శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ లింగ అన్నారు. మంగళవారం పెన్షనర్స్ భవన్ లో జరిగిన బాడీ అవయవ దాన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...