Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 7:37 pm Posted by : ramakrishna

గుట్టు చప్పుడు కాకుండా గుట్టలు మాయం

  • జోరుగా మొరం అక్రమ రవాణా
  • ఇసుక మాఫియాతో మొరం మాఫియా కుమ్మక్కు
  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

 

బతుకమ్మ, కోటగిరి :  ప్రకృతి సంపదను కొల్లగొట్టి జోరుగా రాత్రిపగలు అనే తేడా లేకుండా మొరం అక్రమంగా రవాణా చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యారు. కొద్దిరోజులుగా కోటగిరి మండల కేంద్రలోని ఎక్లాస్పూర్ గుట్ట నుండి  ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబిల టిప్పర్ల  ద్వారా మొరం త్రవ్వకాలు జరుపుతూ మొరం మ్మాఫియా ఇసుక మాఫియా తో కుమ్మక్కై  ఇసుక అక్రమ రవాణాకు  సులభతరం చేసేందుకు మంజీరా నదిలో రహదారి నిర్మించడం కోసం  అక్రమంగా రాత్రులకు రాత్రులే  గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మొరం తరలిస్తూ  గుట్టలు మాయం చేస్తున్న  అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై  ప్రశ్నార్ధకంగా మారింది . విచ్చలవిడిగా మొరం అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా  పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కోటగిరి మండలంలో  అధికారుల కనుసందులలోనే  అక్రమ ఇసుక మొరం మాఫియా  జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పట్టాపై ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం అనుమతులు తీసుకొని  సదరు ప్రైవేటు ల్యాండ్ లో  ఇసుక లేనప్పటికీ రాత్రి సమయాలలో సదరు ప్రైవేట్ ల్యాండ్ లో ఇసుక డంపులు చేసి  ఉదయం అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా  వాహనాల రాకపోకలకు  సులువుగా ఉండేందుకు మురమ్మాఫియా తో చేతులు కలిపి టిప్పర్ల ద్వారా మొరం తరలిస్తూ రాంపులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బతుకమ్మ ప్రతినిధి  సంబంధిత తహసిల్దార్ కు పూర్తి సమాచారం కోసం చరవాణి ద్వారా సంప్రదించగా  స్పందించకపోవడం గమనార్ధం.

The hills disappear without a sound.