Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 August 2025, 6:33 pm Posted by : ramakrishna

హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి

  • రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డీఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కేర్ డిగ్రీ కళాశాలలో  డీఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలు కు ముందు నియామక నోటిఫికేషన్ లు, వ్రాత పరీక్ష, ఫలితాలు విడుదలై సిపిఎస్ అమలు తరువాత  ప్రభుత్వ ఆలస్యం కారణంగా నియామకం జరిగి, సిపిఎస్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు, పాత పెన్షన్ వర్తింపజేయాలి అని కేంద్ర ప్రభుత్వం మెమో 57 ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ మెమో ఆధారంగా దేశం లోని దాదాపు సగం రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయన్నారు. మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా 3 నెలలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని స్పష్టమైన  తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు యు.విజయ్ కుమార్, వెంకట్ రాజ్ రెడ్డి, సురేందర్, రామకృష్ణ,మురళి,మాణిక్యం, పరమేశ్వర్, స్వప్న, మాధవి, రాగసుధ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

The High Court verdict should be implemented immediately.