Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:51 pm Posted by : ramakrishna

నీట్ లీకేజి సెగ…

 

. . . విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ దారుణం

 

. . . బాన్సువాడ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు షేక్ మతీన్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను కుదిపేస్తున్న ‘నీట్’ పేపర్ లీకేజీ ఉదంతం ప్రస్తుతం రాజకీయ రణరంగంగా మారిందని బాన్సువాడ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు షేక్ మతీన్ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ పై జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని  టిడిపి యువ నాయకులు షేక్ మతీన్ ఖండించారు. ప్రతిష్టాత్మక పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ దాకా విద్యార్థులు, యువత తీవ్ర ఆందోళనలు చేస్తుంటే.. ఆ నిరసనలకు మద్దతుగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో గత 25 రోజులుగా పార్టీలకు అతీతంగా యువత, విద్యార్థులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి లోకానికి నా మద్దత్తు ఎల్లప్పుడు ఉంటుందన్నారు.  విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం విని, సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.