Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 6:18 pm Posted by : ramakrishna

దయా హృదయుడు పుప్పాల దినేష్

  • విద్యార్థులకు సొంత డబ్బులతో యూనిఫామ్ అందజేత

 

మోర్తాడ్, బతుకమ్మ: చదువు పట్ల చదువుకునే వారి పట్ల తనకున్న మక్కువతో విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ బట్టల్ని బహుమతిగా అందించిన పుప్పాల దినేష్ దయా హృదయుడని మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి అన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శెట్ పల్లి గ్రామంలో గ్రామ వాస్తవ్యులైన దినేష్ పిల్లలందరికీ రెండు జతల యూనిఫామ్స్ కొనిచ్చారని తెలిపారు. వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సత్తారపు ప్రతాప్ పిల్లలకు ఒక్క జత షూస్ కొనిచ్చరని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొనకల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు డి కె జగదీశ్వర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ లక్ష్మణ్, ఆశ సి ఆర్ పి పరిమళ తదితరులు పాల్గొన్నారు.

The heart of kindness is the heart of Puppala Dinesh.