Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2025, 12:32 pm Posted by : ramakrishna

తప్పిపోయిన విద్యార్థినుల కథా సుఖాంతం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రెండో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హాస్టల్ నుంచి బుధవారం ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన కథా సుఖాంతమైంది.  ముగ్గురి విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండో టౌన్ ఐడీ పార్టీ పోలీసులు ప్రత్యేక  గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఒక విద్యార్థిని ఆచూకీ గురువారం అర్ధరాత్రి తర్వాత లభ్యంకాగా, మరో ఇద్దరి విద్యార్థినులను ఆచూకీ శుక్రవారం ఉదయం లభించింది. విద్యార్థినులను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు.