Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2025, 4:55 pm Posted by : ramakrishna

గూగుల్ మ్యాప్ తెచ్చిన తంట

  • టోల్ తప్పించుకోబోయి బురదలోకి దూసుకెళ్లిన కారు

     

  • బతుకమ్మ, భిక్కనూరు: గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో టోల్ తప్పించుకోబోయే బురదలోకి చిక్కుకొని పోయిన సంఘటన భిక్కనూరు మండలంలోని టోల్ ప్లాజా సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే యూఎస్ నుండి 20 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చిన నిజామాబాద్ కు చెందిన సంజీవులు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే సమయంలో క్యాబ్ డ్రైవర్ టోల్ ప్లాజా తప్పించబోయి బురదలోకి దూసుకెళ్లింది. సంజీవులు 100 నెంబర్ కాల్ చేయగా భిక్కనూరు పోలీసులు అశోక్ శేఖర్ లు లోకేషన్ షేర్ చేసుకొని కారును సురక్షితంగా బయటకు తరలించారు. పోలీసు వారికి సమాచారం ఇవ్వగానే నిమిషాలలో వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
  • The guy who brought Google Maps
  • The guy who brought Google Maps