- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి
- అసువులుబాసిన అమరులకు నివాళులర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల
వేల్పూర్, బతుకమ్మ : కాశ్మీర్ లోని పహాల్ గావ్ వద్ద పర్యాటక్కులపై జరిగిన దాడి ఇంటిలిజెన్సీ వైఫల్యమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీయర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పహాల్ గావ్ ఘటనలో అసువులు బాసిన అమరుల ఆత్మశాంతికి మౌనం పాటించి, అమరుల చిత్ర పటానికి పూలమాల వేసి కొవ్వత్తిని వెలిగించి నివాళులార్పించారు.అమరుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన ఎమ్మెల్యే పహాల్ గావ్ ఘటనను బీయర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ ను ఎదురుకోలేని శత్రువులు పిరికిపందల చర్యలకు పాల్పడ్డారని అన్నారు.ఈ హేయమైన చర్యలకు పాల్పడ్డ సంస్థలు, వ్యక్తులను, ప్రోత్సహించిన వారికి భారత్ పక్షనా దీటైనా జవాబు చెప్పాలన్నారు. మన దేశ ఆస్థిత్వాన్ని దెబ్బ తీసే వారిపై కేంద్రం తీసుకొనే చర్యలకు యావత్ భారత దేశం ముక్త కంఠం తో మద్దత్తు తెలుపుతుందని అన్నారు. భారత సైన్యం, భారత వ్యవస్థ గొప్ప జాతీయ వాదంతో ముందుకు వెళ్తుందని, ఇలాంటి సమయం లో సైన్యం, దేశ ప్రజల్లో ఆత్మ స్థైర్యం దెబ్బ తినకుండా దాడులకు పాల్పడ్డ ముష్కరులపై కేంద్రం చెంపపెట్టు చర్యలు చేపట్టాలని బీయర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
