హమాలీలకు ఇచ్చిన హామీని అమలుచేయాలి
బతుకమ్మ, జుక్కల్ : రాష్ట్ర ప్రభుత్వం హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ డిమాండ్ చేశారు. బిచ్కుంద మండల కేంద్రంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు బుధవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత సంవత్సరం అక్టోబర్ 4న సివిల్ సప్లై కమిషనర్ తో జరిపిన చర్చల్లో క్వింటాళులకు రూ.26 ఉన్న హమాలీ రేటును రూ.29 పెంచడానికి అంగీకరించారని తెలిపారు. రెండు జతల బట్టలు కుట్టుకూలీతో కలిపి...