Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 3:58 pm Posted by : ramakrishna

హమాలీలకు ఇచ్చిన హామీని అమలుచేయాలి

బతుకమ్మ, జుక్కల్ : రాష్ట్ర ప్రభుత్వం హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ డిమాండ్ చేశారు. బిచ్కుంద మండల కేంద్రంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు బుధవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత సంవత్సరం అక్టోబర్ 4న సివిల్ సప్లై కమిషనర్ తో జరిపిన చర్చల్లో క్వింటాళులకు రూ.26 ఉన్న హమాలీ రేటును రూ.29 పెంచడానికి అంగీకరించారని తెలిపారు. రెండు జతల బట్టలు కుట్టుకూలీతో కలిపి ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రతీ సంవత్సరం బోనస్, పెండిగ్ లో ఉన్న పది నెలల కమీషన్ రేటు, ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు ఆరోగ్య హెల్త కార్డులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు జీఓ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హమాలీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షుడు పండరి,కార్యదర్శి అశోక్, బిచ్కుంద ఎం.ఎల్.ఎస్. పాయింట్ హమాలీలు సంతోష్, రవీందర్, అంజయ్య, శివాజీ, నాందేవ్, సాయిలు, శ్రీనివాస్ హమాలీలు పాల్గొన్నారు.