అంగరంగ వైభవంగ శ్రీ రాముని శోభాయాత్ర
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీరాములయ్య కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి శ్రీ రాముని శోభయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో, డీజే చప్పుల్లతో ప్రధాన వీధుల గుండ శోభయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రలో హనుమాన్ స్వాములు, శ్రీరామలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.