Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 4:15 pm Posted by : ramakrishna

అంగరంగ వైభవంగ అమ్మవారి జయంతి ఉత్సవాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్బంగా కిసాన్ గంజ్ ఆర్యవైశ్య పట్టణ సంఘంలో నిర్వహించిన వేడుకలకు ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతేక పూజ కార్యక్రమాలు, అమ్మవారికి నామకరణ, డోలారోహనం, అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే

The grand celebrations of the birth anniversary of the Goddess

మాట్లాడుతు ఆర్యవైశ్య కుల దైవం అయినా శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఇతరదేశాల్లో ఉన్న ఆర్యవైశ్య సోదరి, సోదరీమణులు జరుపుకోవడం హైందవ జాతి జీవన విధానం,సనాతన హిందూ ధర్మాన్ని రక్షిండమే అవుతుందన్నారు. వాసవి మాత ఆశీర్వాదంతో భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక పంటలు పండాలని,ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

The grand celebrations of the birth anniversary of the Goddess