ధాన్యం త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలి
అదనపు కలెక్టర్ విక్టర్ పలు చోట్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన కామారెడ్డి, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియల్, కామారెడ్డి మండలంలోని సారంపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా, అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోతుందని, ముందస్తుగా తూకం వేసి సంబంధిత...