Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 2:08 pm Posted by : ramakrishna

ధాన్యం త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలి

అదనపు కలెక్టర్ విక్టర్

పలు చోట్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియల్, కామారెడ్డి మండలంలోని సారంపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా, అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోతుందని,  ముందస్తుగా తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించాలని కేంద్రం ఇన్ చార్జిలను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ లను ధాన్యంపై కప్పివేయాలని తెలిపారు. ఆయన వెంట సంబంధిత తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, కేంద్రాల ఇన్ చార్జిలు ఉన్నారు.