ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరగాలి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా పాలనాధికారి   నిజామాబాద్, బతుకమ్మ :  కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లలో నమోదు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన మీదట వారికి రసీదులు అందించాలని, సదరు రైతు వివరాలు క్రాప్ బుకింగ్ డేటాలో నమోదై ఉన్నాయా అని పరిశీలించుకోవాలని సూచించారు. మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్...