ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటదివెంట మిల్లులకు చేర్చాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   నిజామాబాద్, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధర్పల్లి మండలం హొన్నాజీపేట్, ధర్పల్లి, సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామాలలో  ఐకేపీ మహిళా సంఘాలు, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారు,...