ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ నిజామాబాద్, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నవీపేట్ మండలం నాగేపూర్, నిజాంపూర్, నాలేశ్వర్, నవీపేట్ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. కాంటా చేసేందుకు సిద్ధంగా ఉంచిన...