కార్మికుల పట్ల ప్రభుత్వం సవతితల్లి ప్రేమ

ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.రమేష్   సిరికొండ, బతుకమ్మ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఇందిరమ్మ  ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వ సవతితల్లి ప్రేమ చూపిస్తోందని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. రమేష్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం  సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు  అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు....