ప్రభుత్వ పాపమే రైతులకు శాపం
ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత సమావేశం నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని, కనీసం సర్వే చేయలేదని నష్టం వివరాలు అంచనా వేయకపోవడం దారుణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామస్థులను పంట నష్టంపై శనివారం రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు యూరియ సప్లయ్ చేయటం...