Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 6:53 pm Posted by : ramakrishna

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ విధానం ఏంటో తెలియజేయాలి

  • పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ లో 2009, 2012 నియామకాలపై హై కోర్ట్ ఇచ్చిన తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏంటో తెలియజేయాలనీ పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు పి డి ఎస్ యూ తే.యూ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ లో ప్రొఫెసర్, అసోసియేట్,  అసిస్టెంట్  ప్రొఫెసర్ నియమకాలు రోస్టర్ ప్రకారం జరగలేదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్రమ నియమకాలపై  చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యార్థులకు విద్య బోధనకు నష్టం కలగకుండా యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయ సలహా పేరు మీద విద్యార్థులు ఫీజుల రూపంలో కట్టిన లక్షలాది రూపాయలు డబ్బులను (దుబారా ఖర్చులు) వృధా చేస్తే విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తాం అన్నారు. కబ్జాకు గురవుతున్న తెలంగాణ యూనివర్సిటీ 50 ఎకరాల భూమి  విషయంలో హైకోర్టులో కేసు వేసి యూనివర్సిటీ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తే.యూ పి డి ఎస్ యూ నాయకులు అక్షయ్, రవీందర్, రాకేష్,గౌతం రాజ్, దినేష్, అజయ్, పృధ్వీ, మణికాంత్ వినీల్, రుషేందర్,సురేష్, క్రిష్ణాన్న, బలమణి, సాయి, గాయత్రీ, తదితదిరులు పాల్గొన్నారు.

The government's policy on the High Court verdict should be made known.