మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్, బతుకమ్మ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...