ఎల్లారెడ్డి ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం విస్తృత పర్యటనలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా దేవునిపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి ఆలయం సమీపంలో నిర్మించనున్న ఫంక్షన్ హాల్‌కు సంబంధించి రూ.10 లక్షల నిధుల ప్రొసీడింగ్ కాపీని గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం తెలంగాణ...