Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2025, 6:36 pm Posted by : ramakrishna

మహిళలను కోటీశ్వర్లు చేయడమే ప్రభుత్వ ధ్యేయం

  • నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: మహిళలను కోటీశ్వర్లు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి  భూపతిరెడ్డి పేర్కొన్నారు.  నిజాంమాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు  చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున నిజామాబాద్ రూరల్  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా ఉన్నాయని అన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని, నిజామాబాద్ రూరల్ మండలంలోని 29 మంది లబ్ధిదారులకు, మోపాల్ మండలంలోని 25 మంది లబ్ధిదారులకు, డిచ్పల్లి మండలంలోని 70 మంది లబ్ధిదారులకు, ఇందల్వాయి మండలంలోని 15 మంది లబ్ధిదారులకు, జక్రన్ పల్లి మండలంలోని 50 మంది లబ్ధిదారులకు, సిరికొండ మండలంలోని 19 మంది లబ్ధిదారులకు,మొత్తంగా 208 మందికి లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మరో పథకం  ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో మొదటి విడతగా సొంతగా భూమి ఉన్న వారికి 3200 ఇండ్లను  మంజూరు పత్రాలను ఇచ్చామని, కొంతమంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకోవడం జరిగిందని అన్నారు.  కొంతమంది లబ్ధిదారులు  బేస్ మెంట్ వరకు  కట్టినవారికి లక్ష రూపాయలు మొదటి ఇంతగా ఇవ్వడం జరిగిందని అన్నారు. సొంత భూమి లేనివారికి రెండో విడతలో 75 గజాల భూమిని ఇచ్చి , ఇందిరమ్మ ఇండ్లను  కట్టిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మహిళలు కోటేశ్వర్లుగా చేయడమే ప్రధాన ధ్యేయమని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి నడిపించడం జరుగుతుందని, ఇందిరమ్మ శక్తి క్యాంటీన్ ల  ద్వారా  మహిళలకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమని అన్నారు. ఈ చెక్కుల  పంపిణీ కార్యక్రమంలో  పీసీసీ  డెలికేట్ శేఖర్ గౌడ్, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  అమృతపూర్ గంగాధర్, చిన్నారెడ్డి, నవీన్ గౌడ్, రవి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు  తదితరులు పాల్గొన్నారు.

The government's goal is to make women millionaires.