మహిళను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పం
సర్కారు తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపు అట్టహాసంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ నిజామాబాద్, బతుకమ్మ : మహిళా సాధికారత సాధనలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గుర్తు చేశారు. బోధన శాసనసభ నియోజకవర్గం పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మంగళవారం బోధన్ పట్టణంలోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్...