Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 8:05 pm Posted by : ramakrishna

మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

  • సీసీ గడాల రఘుపతి

 

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రంలో మహిళలను కోటేశ్వర్లను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఋణలను అందిస్తోందని ఐకేపీ సీసీ గడాల రఘుపతి అన్నారు. సోమవారం మండలంలోని చెంగల్ గ్రామంలో మహిళా గ్రామ సంఘ సమావేశంను ఏర్పాటు చేసి ఎస్ బి ఐ నూతన మేనేజర్ శృతి మేడం ను సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ లో తీసుకొన్న ఋణలు రెగ్యులర్ గా కట్టడం, తీసుకోవడం ఉంటే బ్యాంక్ అధికారులు ఎప్పుడైనా ఋణలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని, బ్యాంక్ సిబ్బందికి మనం, మనకు బ్యాంక్ సిబ్బంది ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. మహిళలు ఋణలను సద్వినియోగం చేసుకోవాలని, సరిఅయిన సమయంలో పేమెంట్ చెయ్యాలని సీసీ సూచించారు. బ్యాంక్ రుణాలు తీసుకొన్నా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ లేని ఋణలు ఇస్తుందని తెలిపారు. మేనేజర్ శృతి మాట్లాడుతూ రుణాలు సక్రమంగా చెల్లించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విదంగా బ్యాంక్ లో ప్రధానమంత్రి సురక్ష భీమా, జీవన జ్యోతి భీమా లాంటి ఇన్సూరెన్స్ లు చెల్లించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో వి. ఓ ప్రెసిడెంట్ స్రవంతి, లక్ష్మి, వి. వో ఏ లు చెవ్వ సునీత, శీరీష, మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.