- సీసీ.గడాల రఘుపతి
భీంగల్, బతుకమ్మ : మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఆర్ధిక సహాయాన్ని అందించి మహిళలను కోటేశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఐకేపీ సీ సీ గడాల రఘుపతి అన్నారు. సెర్ఫ్ సీ ఈ ఓ ఆదేశానుసారం గురువారం మండలంలోని పిప్రి గ్రామంలోగుప్పెడు పప్పు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి గ్రామంలోని రెండు నిరుపేద కుటుంబాలకు గుప్పెడు పప్పును అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘల్లో సభ్యత్వం లేనివారు వెంటనే చేరాలన్నారు. ముఖ్యంగా నిరుపేద మహిళలను సంఘాల్లో చేర్చాలని అన్నారు. 15 సంవత్సరాలు నిండిన మహిళాల సంఘంను ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. అదే విధంగా 60 సంవత్సరాలు నిండిన మహిళల చేత కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా తయారు చేసిన సంఘాలకు ప్రభుత్వం రివాళ్వింగ్ ఫండ్ ను ఇస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సంఘ అధ్యక్షురాలు, జి.పి కార్యదర్శి, వివోఏ లు నిరోషా, విశాలలు, గ్రామ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.