Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 9:48 pm Posted by : ramakrishna

పేదల సొంతింటి కలనే ప్రభుత్వ లక్ష్యం

 

. . . సర్పంచ్ రాధా మురళి గౌడ్

 

పిట్లం, బతుకమ్మ :

 

పేదల సొంత ఇంటి కలలను తీర్చెవిధంగా ప్రభుత్వం పనులు చేపడుతుందని చిల్లర్గి గ్రామ సర్పంచ్ రాధా మురళిగౌడ్ అన్నారు. ఆమె మాట్లాడుతూ చిల్లర్గి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన 24 ఇళ్లలో దాదాపు 15 ఇళ్లకు ముగ్గు వేయడం గ్రామంలో ఆనంద వాతావరణాన్ని తీసుకొచ్చిందన్నారు. గత పది రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతోందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న సెక్రటరీ వినోద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగ్నాథ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సేవలను గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ నాయకులు సాయి నిఖిల్ గౌడ్, ఇస్తాక్, గంగారం తదితరులు పాల్గొన్నారు.