మోర్తాడ్, బత్కమ్మ: రైతులను రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రంను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఏ ఏం సీ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. A గ్రేడ్ రకానికి రూ. 2389, B గ్రేడ్ రకానికి రూ.2369 మద్దతు ధర ఉందన్నారు. కార్యక్రమంలో AMC డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీద్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గోపి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పుప్పాల అశోక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కం అశోక్, నాగభూషణం, ఏనుగు మోహన్, కొమిరే శ్రీధర్, సుధన్, అబ్దుల్ మోయిజ్, ఐ కే పీ అధికారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.