పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
భిక్కనూరు, బతుకమ్మ : పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపారి భీమ్ రెడ్డి అన్నారు. గురువారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును పూర్తి చేసుకున్న సుభద్ర అనే లబ్ధిదారు ఇంటిని వారు ప్రారంభించి మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ప్రభుత్వం...