భిక్కనూరు, బతుకమ్మ :
పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపారి భీమ్ రెడ్డి అన్నారు. గురువారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును పూర్తి చేసుకున్న సుభద్ర అనే లబ్ధిదారు ఇంటిని వారు ప్రారంభించి మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇంటిని నాణ్యత తో నిర్మించుకొని ప్రభుత్వం అందించే ఐదు లక్షల సాయాన్ని అందుకోవాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సారే అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చైతన్య నాయకులు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
