Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 6:44 pm Posted by : ramakrishna

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటు ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం

 . . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిలా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే మెడికల్ హాల్‌ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.  ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ…నగర వాసులకు అవసరమైన అన్ని రకాల మందులు ఒకే చోట అందించే విధంగా ఈ మెడికల్ హాల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. వైద్య రంగంలో సేవాభావంతో ముందుకు వచ్చిన వారు సమాజానికి ఎంతో మేలు చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నాయకులు ముజాహిద్ ఖాన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మెడికల్ హాల్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు మందులు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

The government's goal is to ensure that quality medical services are available to the public